ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ

విధుల నుంచి వ్యక్తిగత కార్యదర్శి తొలగింపు

ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ వెల్లడిరచింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వసస్పష్టం చేసింది.