భూపేష్, ఆదినారాయణరెడ్డి పిలుపు
జమ్మలమడుగు, మహానాడు: సైకో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి అన్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కోవెలకుంట్ల రోడ్డులో ఉన్న రంగనాథ స్వామి కళ్యాణ మండపంలో గురువారం పెద్దముడియం మండల కూటమి పార్టీల కార్యకర్తల సమావేశం జరిగింది. ఇద్దరు అభ్యర్థులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. మే 13న తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.