పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరిక

అనంతపురం జిల్లా రాప్తాడు, మహానాడు: రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్‌ మండలం ఇటుకలపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాల వారు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వెంకటాపురం క్యాంప్‌ కార్యాలయంలో పరిటాల సునీత సమక్షంలో వారు చేరారు. చేరిన వారిలో అన్నగిరి మల్లేష్‌, అన్నగిరి ఆంజనేయులు, ఎ.చంద్రశేఖర్‌, ఎ.లలిత, ఎ.శివయ్య, ఎ.మల్లికార్జున, బి.రాజు, కె.శంకర్‌ తదితరులు ఉన్నారు. స్థానిక పంచాయతీ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.