ఓటమి భయంతోనే వైసీపీ దాడులు

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
ఒంగోలు నేతపై దాడికి ఖండన

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించడం, ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేయటాన్ని ఆమె ఖండిరచారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ మూకలపై, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు పోలీసుల అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని కోరారు. మోహన్‌రావుపై దాడి చేసిన రౌడీలపై జిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌ విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.