జ్యోతిరావు పూలేకు కన్నా నివాళి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తనపల్లి పట్టణం రఘురాం నగర్‌ ప్రజావేదికలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ, దళిత, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.