గ్రామస్థాయిలో నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి

జాగర్లమూడి ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని

తెనాలి, మహానాడు: ‘గ్రామస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. మెజారిటీతో కూడిన విజయం అందినప్పుడు ఆయా గ్రామాలకు ఖచ్చితమైన న్యాయం చేయాలనే బాధ్యత నాయకుల్లో పెరుగుతుంది’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడిలో గురువారం ఏర్పాటుచేసిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పవన్‌ వెంట ప్రజలు ప్రవాహంలో వస్తూ ఉంటారని, అలాంటి కార్యకర్తలతో కలిసి పనిచేయడం మాలాంటి నాయకులకు మరింత ఉత్సాహం ఇస్తుందని తెలిపారు.

నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన తరుణంలో కూటమి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఎన్నికల గుర్తు, ఓటింగ్‌ తదితర వివరాలపై ఓటర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబ త్తుని జయలక్ష్మి, జాగర్లమూడి సర్పంచ్‌ పాలడుగు జయ నాగలక్ష్మి, ఎంపీటీసీ పసుపులేటి వెంకట నరసమ్మ, మాజీ సర్పంచ్‌ క్రీస్తు మనెమ్మ, టీడీపీ నాయకులు వీరమాచనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.