బాబు కావాలా…బాదుడు కావాలా?

కరెంట్‌ బిల్లులంటే భయపడుతున్న ప్రజలు
ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం
జగన్‌ గెలిస్తే అధోగతే
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్‌ : రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో పైసా కూడా పెంచని చంద్రబాబు కావాలో, తొమ్మిదిసార్లు భారీఎత్తున కరెంటు బిల్లులు పెంచిన జగన్‌ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. కరెంట్‌ బిల్లుల మోతలు, కరెం టు కోతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న జగన్‌ మళ్లీ గెలిస్తే మిగిలేవి చీకట్లే అని హెచ్చరించారు. చిలకలూరిపేట మెయిన్‌ బజార్‌, 17వ వార్డులో గురువారం ఎన్నికల శంఖారావం, సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఆయన ప్రచారం నిర్వహించారు. వ్యాపార వర్గాల తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సాధికార సారథు లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు.

జగన్‌ స్థాయిలో కరెంటు బిల్లులు పెంచిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మరొకరు లేరన్నారు. టారిఫ్‌, శ్లాబుల మార్పులు, ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు చార్జీలు, ఇతర సుంకాల పెంపుతో నెలవారీ కరెంటు బిల్లులంటేనే భయపడే పరిస్థితి తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం మీద సగటున ఏడాదికి 10 వేల కోట్ల రూపాయలకు పైగా కరెంటు చార్జీలు బాదేశారంటే ప్రజలపై ఏ స్థాయిలో భారం వేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్యక్ర మంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్‌, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.