-అనుచరులతో చర్చించి రెండురోజుల్లో నిర్ణయం
-అవసరమైతే ఇండిపెండెంట్‌గా దిగుతా
-టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్
మచిలీపట్నం, మహానాడు: తాను పెడన నియోజకవర్గం సీటు ఆశించానని, చంద్రబాబు సీటు ఇవ్వకపోవటంతో మనస్థాపంతో అస్వస్థతకు గురయ్యానని మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు బూరగడ్డ వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయు డు, లోకేష్ లు 2019లోనే తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తామని మాట ఇచ్చారని, కొన్ని సమీకరణాల కారణంగా ఇవ్వలేకపోయారని, 2024లో తప్పక సీటు ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేదన్నారు.
తాను రాజకీయాలను వదలను, పెడన నియోజకవర్గాన్ని వదిలేది లేదని తేల్చిచెప్పారు. రెండు మూడురోజుల్లో అనుచరులతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటి స్తానని, అవసరమైతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం ఆయనను జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు 2004 నుంచి ఆయనతో సత్సంబంధాలు ఉన్నా యని, అధిష్టానంతో మాట్లాడి సముచిత నిర్ణయం తీసుకుంటామని, ఆయన మాతోనే కలిసి పనిచేస్తారని తెలిపారు. మరి వేదవ్యాస్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాలి.