అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ

పెనుకొండ, మహానాడు: అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మేజర్‌ పంచాయతీ పరిధిలోని కసిరెడ్డిపల్లి, కసిరెడ్డిపల్లి కాలనీ, తిప్పరాజుపల్లి గ్రామాలలో గురువారం ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. సంపద ఎలా సృష్టించాలన్నది చంద్రబాబుకు బాగా తెలుసునని, ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. సంక్షేమం అన్న పదం పుట్టిందే తెలుగుదేశం పార్టీ నుంచి అన్నారు. వైసీపీ నాయకుల మోసపూరిత హామీలు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.