వైఎస్, వివేకా ఆత్మలు క్షోభిస్తున్నాయి…
న్యాయం కోసం పోరాడే షర్మిల కావాలా…
హంతకుడు అవినాష్ కావాలా?
మీ ఓటు న్యాయానికా? అధర్మానికా?
ప్రజా కోర్టులో తీర్పు చెప్పాలి
అన్యాయాన్ని ఎదిరించేందుకే పోటీ చేస్తున్నా
నేను వైఎస్సార్ బిడ్డను…పులి బిడ్డను
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి
సూటి ప్రశ్నలతో ఎన్నికల ప్రచారం
తోడుగా వివేకా కుమార్తె సునీత
కడప, మహానాడు: న్యాయం కోసం పోరాడే షర్మిల కావాలా…హంతకుడు అవినాష్ కావాలో ప్రజా కోర్టులో తీర్పు చెప్పాలని పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మి లారెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో ఎన్నికల ప్రచారంలో వివేకా కుమార్తె సునీతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్, వివేకా మీ బిడ్డలు.. మేము కూడా మీ ఇంటి బిడ్డలం..వైఎస్సార్‌కు ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమ.. బతికినంత కాలం ప్రజల కోసమే బతికాడు.. చనిపోయాక కూడా ఇక్కడే నిద్రిస్తున్నాడు..వివేకా సైతం ప్రజల మనిషి.. ఇద్దరూ వెళ్లిపోయారు.. ఇలాంటి నేతలు బూతద్దంలో పెట్టి చూసినా కనపడరు..వివేకాను కిరాతకంగా నరికి చంపారు…ఆయన ఆత్మ ఈరోజు ఘోషిస్తోంది..హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని సీబీఐ చెప్పింది.. ఆధా రాలు కూడా ఉన్నాయి…అయినా ఇంతవరకు శిక్ష పడలేదు..స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతు న్నారు.. సొంత చిన్నాన్నను చంపిన దోషులను రక్షించడానికా అధికారం ఇచ్చింది? అని పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నించా రు.
ఒక్కరోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోకుండా దర్జాగా బయట తిరుగుతున్నాడు..ఈ అన్యాయం తట్టుకోలేకనే…వైఎస్సార్ బిడ్డ పోటీ చేస్తుం దని వ్యాఖ్యానించారు. అధర్మాన్ని ఎదురించేందుకే ఎంపీగా నిలబడ్డా.. ఒకవైపు వైఎస్సార్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి.. ఒకవైపు న్యాయం…మరో వైపు అధర్మం…ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారో… అన్యా యాన్ని గెలిపిస్తారో తీర్పు చెప్పాలని కోరారు. నేను వైఎస్సార్ బిడ్డను..పులి కడుపున పులే పడుతుందని అన్నారు.
తప్పు చేసిన వాళ్లే భయపడతారు: సునీత
వివేకా కుమార్తె సునీతారెడ్డి మాట్లాడుతూ మీరు ఓటు వేసిన వాళ్లు ఎక్కడ ఉన్నారు? మీ కోసం పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మనం న్యాయం వైపు ఉన్నామా? అన్యాయం వైపు ఉన్నామా? ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారు..తప్పు చేయకుంటే భయం ఎందుకు? అని ప్రశ్నించారు. ధర్మం వైపు షర్మిల నిలబడిరది.. ఆమె ను గెలిపించి న్యాయాన్ని నిలబెట్టాలని కోరారు.