14న మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ముస్లిం మైనారిటీ నాయకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై దీటుగా సమాధానం ఇవ్వాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్నగర్ ప్రజావేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 14న జరగబో యే ముస్లిం మైనారిటీ నాయకుల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశా న్ని విజయవంతం చేయాలని కోరారు.
ముస్లింలకు న్యాయం జరగాలంటే కూటమిని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.