కాకినాడ జిల్లా పెద్దాపురం, మహానాడు: ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురంలో శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా 8 కిలోల బంగారం, 46 కిలోల వెండి పట్టుబడిరది. పెద్దాపురం సీఐ రవికుమార్‌కు అందిన సమాచారం మేరకు డీఎస్పీ లతాకుమారి పర్యవేక్షణలో పెద్దాపురం ఎస్సై సురేష్ తనిఖీలు నిర్వహించారు. బీవీసీ లాజిస్టిక్స్ వాహనం నుంచి ఎటువంటి అనుమతులు, పత్రాలు లేని రూ.5.60 కోట్ల విలువైన 8 కిలోల 116.89 గ్రాముల బంగారం, 46 కిలోల 447.944 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం ఆర్డీవో సమక్షంలో సీజ్ చేశారు.