షర్మిల ప్రచారంపై వైసీసీ అల్లరిమూకల దాడి

`రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు
`లింగాల మండల కేంద్రంలో ఉద్రిక్తత
`వివేకాను ఎవరు హత్య చేశారో…
పూల అంగళ్ల దగ్గర తేల్చుకుందామా?
`అల్లరిమూకలకు షర్మిలారెడ్డి సవాల్‌
`ఓడిపోతామనే భయంతోనే అవినాష్‌ తెగబడ్డాడు
`అందుకే మా పర్యటనలకు అడ్డుకుంటున్నారు
`ఒకప్పుడు జగన్‌కు చెల్లెను కాను…బిడ్డను
`ఆయన సీఎం అయ్యాక పరిచయం లేదని వ్యాఖ్యలు

కడప, మహానాడు: కడప జిల్లాలో పీసీసీ చీఫ్‌, ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి శుక్రవారం నిర్వ హించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ అల్లరిమూకలు తెగబడ్డారు. ఆమె పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అల్లరిమూకలను పోలీసులు చెదరగొట్టారు. ఇదే సందర్భంలో షర్మిల అడ్డుకున్న వారిపై ప్రశ్నలు సంధించారు. హంతకులకు జగన్‌ అండగా నిలబడ్డందుకే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా.. హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ చేస్తున్నా… న్యాయం, ధర్మం ఒకవైపు ..అన్యాయం, హంతకులు ఒకవైపు.. అల్లరి చేసే వాళ్లు పులివెందులకు రండి…పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెడదాం.. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం అని సవాల్‌ విసిరారు.

ఇది ఒక కుటుంబ విషయం కాదు…ప్రజానాయకుడు వివేకా హత్య విషయం. ఆయనను సీబీఐ హంతకుడు అని తేల్చింది..అన్ని ఆధారాలు బయట పెట్టింది..హత్య చేసిన వాళ్లు..హత్య చేయించిన వాళ్లతో ముందు రోజు ఫోన్‌ కాల్స్‌లో మాట్లాడు కున్నారు..హత్యకు పెద్దఎత్తున లావాదేవీలు నడిచాయి.. హంతకుడు అవినాష్‌రెడ్డిని కాపాడుతూ శిక్ష పడకుండా జగన్‌ అడ్డుపడుతు న్నాడు.. అందుకే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా.. హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ చేస్తున్నా…న్యాయం, ధర్మం ఒకవైపు.. అన్యాయం, హంతకులు ఒకవైపు..ఒకప్పుడు జగన్‌ చెల్లిని కాదు..బిడ్డను. ఆయన సీఎం అయ్యాక నాకు పరిచయం లేదని వ్యాఖ్యలు చేశారు. నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను…మీ బిడ్డను.. ఆశీర్వదిస్తే మీ గళాన్ని ఢల్లీి దాకా వినిపిస్తా అంటూ హామీ ఇచ్చారు.