ఏ ఒక్క ఓటు చేజారకూడదు

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌
టీడీపీ, జనసేన నాయకులతో సమీక్ష

గుంటూరు, మహానాడు: విజయమే లక్ష్యంగా పోరాడుదామని, ఏ ఒక్క ఓటు చేజారకూడదని గుంటూ రు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం క్లస్టర్‌ ఇన్‌చార్జులతో ఆయ న టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. స్థానిక సమస్యలతో పాటు ఓటర్లకు ఎన్నికలపై అవగాహన కల్పించే విధి విధానాలపై సూచనలు చేశారు. క్లస్టర్‌ ప్రాంతాలలో స్థానికులు, నాయకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తూర్పు టీడీపీ అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ క్లస్టర్‌ ఇన్‌చార్జులు, డివిజన్‌ ఇన్‌చార్జులు కూటమి అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టావర్తి చిట్టిబాబు, నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జనసేన నాయకులతో సమావేశం

కూటమి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సహకరించాలని, కష్టపడి పనిచేసిన జనసైనికుల బాధ్యత తనదని పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు పార్లమెంటరీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ జనసేన డివిజన్‌ అధ్యక్షుల సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కలిసిక ట్టుగా పనిచేసి విజయానికి సహకరించాలని కోరారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మహమ్మద్‌ నశీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ కూటమి పార్టీలకు కలిపి నియోజకవర్గంలో ఉమ్మడి కార్యాలయం ఏర్పాటు చేస్తామని, బాధ్యత లను సమన్వయం చేసుకుందామని తెలిపారు. సమావేశంలో గుంటూరు తూర్పు జనసేన పార్టీ సమన్వయకర్త నేరెళ్ల సురేష్‌కుమార్‌, డివిజన్‌ల అధ్యక్షులు పాల్గొన్నారు.