జగన్‌ పాలనలో ఐటీ రంగం సర్వనాశనం

-విజన్‌ ఉన్న వ్యక్తి బాబు గెలుపు అవసరం
-దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
-ఐటీ ప్రొఫెషనల్స్‌తో సమావేశం

దర్శి, కురిచేడు రోడ్డులో పీటీఎస్‌ ఫంక్షన్‌ హాలులో కూటమి ఐటీ ఉద్యోగుల సమావేశం శనివారం జరిగింది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌ సాగర్‌, మాగుంట చందన, అశోక్‌ కోళ్ల, వెంకట్‌ జిల్లెల్లమూడి పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఐటీ విజన్‌ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు దేశం లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఎందరో ఐటీ ఉద్యోగులను పరిచయం చేశారన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీతో తెలంగాణ ముఖచిత్రం మారిపోయిందన్నారు.

ఆ తర్వాత ఇన్ఫోటెక్‌, ఐబియం, జీఈ, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, డెల్‌, ఒరాకిల్‌ వంటి ఎన్నో ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు బారులు తీరిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని కూడా లేని నవ్యాంధ్రకు ముఖ్యమం త్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు… విశాఖ, తిరుపతి, విజయవా డలను ఒక్కొక్క సైబరాబాద్‌గా తీర్చిదిద్దాలనుకున్నారని, ముఖ్యంగా విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేశారన్నారు. ఆ తర్వాత అనేక కంపెనీలను తెచ్చారని వివరించారు. తర్వాత అధికారం కోల్పోవడం సైకో జగన్‌ రావడంతో ఐటీ రంగాన్ని సర్వనాశనం చేశారన్నారు. బాబుకు మద్దతు పలికి రెట్టింపు చైతన్యంతో పనిచేయాలని, ఒక్కొక్కరూ కనీసం పది మంది సామాన్య ఓటర్లను ప్రభావితం చేసి పార్టీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.