ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ
గుంటూరు, మహానాడు: గుంటూరు నగరంలో మార్వాడీ ఓటర్లపై టీడీపీ దృష్టిసారించింది. ఆదివారం వారితో గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పెమ్మసాని రత్నశ్రీ, పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి మార్వాడీల సాంప్రదాయంలో తలపాగాలు పెట్టి సత్కరించారు. గల్లా మాధవి మాట్లాడుతూ గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వచ్చి మార్వాడీలు, జైన్‌లు ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్నారు. అంతేకాకుండా మార్వాడీ సంఘాలు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం నా చిన్నతనం నుంచి చూస్తున్నా.. దేశం కోసం మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలు సు… తనను ఎన్నికల్లో గెలిపిస్తే అన్ని రకాల అండగా ఉండి సమస్యలు పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో వ్యాపారాలు క్షీణించి పోయాయని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ప్రతిఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లుగా నగరం గుంతల మయంగా మారి వ్యాపారాలను దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్వాడీల సమస్యలపై దృష్టి: పెమ్మసాని రత్నశ్రీ
మార్వాడీ కుటుంబాలు నగరంలోకి వచ్చిన తరువాత వ్యాపార రంగంలో ఎంతో ప్రావీణ్యతను సాధించి ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని, అయితే ఐదేళ్లుగా వైసీపీ పాలనలో వ్యాపారాలు మూలనపడ్డాయన్నారు. నగరంలో మార్వాడీలు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ను గెలిపించే వరకు మనం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.