పథకం ప్రకారం చేయించుకున్నావ్…
మీ కార్యకర్తలను అరెస్ట్ చేయించు…
ఎస్సీ, ఎస్టీలను బలిచేయొద్దు…
సెక్యూరిటీ మోకాళ్లపై కూర్చుని చూస్తుందా?
మీ నాటకాలు ప్రజలు నమ్మరు
తాడేపల్లి స్క్రిప్టుతో బ్లూ మీడియాలో ప్రచారం
రాజకీయ లబ్ధి కోసం వేషాలు
కూటమి వచ్చాక దోషులను శిక్షిస్తాం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు
మంగళగిరి, మహానాడు: సీఎం జగన్‌పై దాడి గురించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి పోలిట్‌బ్యూరో సభ్యుడు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వారి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో రోడ్ షో చేస్తుంటే రాళ్లు విసిరితే స్వల్పగాయాలయ్యాయని మీడియాలో చూశాం. వాళ్ల పార్టీ నాయకులు రాత్రి టీవీల ముందుకు వచ్చి ఇదంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కుట్ర అని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి వెన క్కి వెళ్లి ఆలోచించండి..ఇలాంటి బుద్ధులు ఎవరికి ఉన్నాయో? గత ఎన్నికలకు ఆరు నెలల ముందు కోడి కత్తి డ్రామా, నెల ముందు బాబాయి దారుణ హత్య మళ్లీ ఈరోజు కరెక్ట్‌గా ఎలక్షన్‌కు నెల ముందు రాయి దాడి… ఎంత కాలం వీటి మీద ఆధారపడి బతుకుతావ్ అంటూ ప్రశ్నించారు. ఏదో ఒకసారి నమ్ముతారు.. పదేపదే అవే చేస్తుంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడివి నీకే భద్రత లేదంటే అది నీ చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో కరెంటు తీసేస్తున్నారు. ముఖ్య మంత్రివి నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీశారు? అని ప్రశ్నించారు. కరెంట్ తీసి నాటకాలు వేసి నీకు రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ గార్డులు మోకాళ్ల మీద కూర్చున్నారు.. ఇదంతా పథకం ప్రకారం తాడేపల్లి ఐపాడ్ ఆధ్వర్యంలో స్క్రిప్ట్ రక్తి కట్టించారు… 100 శాతం ఇది నువ్వే చేయించుకున్నావు… బాబాయి హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని పత్రికల్లో వేసి రాజకీయ లబ్ధి పొందావు. నేను చెప్పడం కాదు నీ చెల్లి చెబుతుంది. రక్తపు పునాదుల మీద మీ ప్రభుత్వం ఏర్ప డిరదని దుయ్యబట్టారు. డ్రామా రక్తి కట్టిస్తున్న జగన్‌ను వెనకేసుకుని వెంటనే తాబేదారులు రెడీ అయి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం చూస్తే అర్థం అవుతుందన్నారు. సీఎం సెక్యూరిటీలో వైఫల్యం దానికి ఎవరు కారణం? మొత్తం ప్రణాళిక ప్రకారం ఎన్నికల ముందు కొత్త డ్రామాకు తెరతీశారు. దీనిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారు… ప్రజలందరూ మీరు చేసే డ్రామాలు గమనిస్తూనే ఉన్నారు… ప్రమాదవశాత్తు జరిగింది, కానీ వదిలేస్తే వేరే గా ఉండేది… మీ నాయకులు అరగంటకు ఒకటి బ్లూ మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు… ఎన్నికల్లో నువ్వు ఏ విధంగా లబ్ధి పొందా లి అనే కోణంలోనే నీ మీడియా చూపిస్తుంది.. ఎవరైతే ఈ పని చేశారో నీ కార్య కర్తలు వారిని అరెస్ట్ చెయ్, అలా కాకుండా ఏ ఎస్సీ, ఎస్టీలనో బలి చేయవద్దని హితవుపలికారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేయించి దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు.