మాజీ మంత్రి పితాని సత్యనారాయణ
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, మహానాడు: ఎన్నికలు వచ్చాయంటే డ్రామాలాడటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, 2019లో కోడి కత్తి డ్రామాకు తెరలేపిన జగన్ ఇప్పుడు గులక రాయితో మళ్లీ డ్రామా మొదలెట్టాడని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించా రు. ఆచంట మండలం వల్లూరులోని జయహో బీసీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేకపోవడంతో డ్రామాలకు తెర లేపాడని విమర్శించారు. ఇప్పటికే ఐదేళ్ల అరాచక పాలనలో ఇసుక, మద్యం దోపిడీ సొమ్ములను తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు.