మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, షేక్ రఫీ, మన్నవ సుబ్బా రావు, కోడూరు అఖిల్, బుచ్చి రాంప్రసాద్, ఎ.వి.రమణ, శంకర్ నాయుడు, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు పాల్గొన్నారు.