మిర్చి రైతులకు చిల్లి బోర్డు ఏర్పాటుకు కృషి

లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు: మిర్చి పంట అధికంగా సాగు జరిగే పల్నాడులో రైతులకు మేలుగా చిల్లి బోర్డు ఏర్పాటుకి కృషి చేస్తామని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం యడ్లపాడు మండలంలో జగ్గాపురం, నాదెండ్ల మండలం లోని గణపవరం గ్రామాల్లో వారు పర్యటించారు. ముందుగా జగ్గాపురంలో ప్రచారం నిర్వహించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో పల్నాడులో సాగుకు ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకు నీరు అందించేలా ప్రాజె క్టుల పూర్తికి కృషి చేస్తామన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఇటీవ ల గాయపడిన దారాల అశోక్‌ను పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం నాదెండ్ల మండలం గణపవ రం గ్రామంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.