23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢల్లీ : మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ సోమ వారం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషి యల్ కస్టడీ విధించింది. ఆ సమయం ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరపున అడ్వొకేట్ జోహెబ్ హుస్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందువల్ల కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరారు. ఇదే సందర్భంలో విత తరపున అడ్వొకేట్ నితీశ్ రాణా వాదిస్తూ కవిత జ్యుడీషి యల్ కస్టడీని పొడిగించాలని కోరడానికి ఈడీ వద్ద కొత్త కారణాలేమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతు న్నదని, అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తున్న దని ఈడీ ఆరోపిస్తూనే ఉందన్నారు. కానీ ఇప్పటివరకు కవిత సహకరించారని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా తీర్పును కాసేపు రిజర్వ్ చేశారు. అనం తరం కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్టు తీర్పు ఇచ్చారు. తిరిగి ఈ నెల 23న కవితను కోర్టులో హాజరు పరచాలని జడ్జి ఆదేశించారు.