అమూల్‌తో రైతులకు తీరని అన్యాయం
ఒప్పందం రద్దు చేసి పాల ధర పెంచుతాం
తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం
దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : తాళ్లూరు మండలంలో పాడి రైతులను ఆదుకుంటామని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో సోమవారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ పాడి పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చి రైతులను ఆదుకుం టామని హామీ ఇచ్చారు. తాళ్లూరు మండలంలో పాడి పరిశ్రమ జీవనాధా రమని, అనేకమంది రైతులు వ్యవసాయంలో ఉన్న నష్టాలను చూసి పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. అయితే వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను కూడా విచ్ఛిన్నం చేసిందని, కమీషన్లకు కక్కుర్తి పడి పాల పరిశ్రమను అమూ ల్ డెయిరీకి ధారా దత్తం చేసిందన్నారు.
పాల ధరలు తగ్గించి రైతుల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. అమూల్ డెయిరీ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చంద్ర బాబు గతంలో చెప్పారని, రైతులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటా మన్నారు. ఇక తాగు, సాగునీటికి అవసరమైన ఎత్తిపోతల పథకాలతో టీడీపీ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మరమ్మతులు లేక గ్రామాలలో తాగునీటికి కూడా కటకట ఏర్పడిరదని విమర్శించారు. మోక్షగుండం రిజర్వాయర్ అసంపూర్తిగా నిలిచిపోవడంతో తాగునీటి, సాగునీటి కష్టాలు తప్పడం లేదని, టీడీపీ అధికా రంలోకి రాగానే ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో మండల టీడీపీ అధ్యక్షులు ఓబుల్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, టీడీపీ నాయకులు శాగం కొండారెడ్డి, వల్లపునేని సుబ్బయ్య, కూట మి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.