ఆర్థిక అసమానతలతో రాష్ట్రం తిరోగమనం

అప్పులతో అభివృద్ధి…వచ్చేది సంక్షోభమే
నియంతృత్వ పోకడలతో విఘాతం
బటన్‌ నొక్కుడుతో రాష్ట్రానికి తీవ్ర నష్టమే
ఉత్పాదకతను ప్రోత్సహించే ఆలోచన చేయాలి
పదేళ్లలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే వారిని ఎన్నుకోండి
ప్రజల్లో మార్పు రావాలి…సరైన చర్చ జరగాలి
మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పి.వి.రమేష్‌ వ్యాఖ్యలు
సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చర్చాగోష్ఠిలో సందేశం

విజయవాడ, మహానాడు : రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు అభివృద్ధి వైపు కాకుండా తీవ్రమైన అప్పులతో ఆర్థిక అసమానతలు పెంచుతూ తిరోగమనం వైపు ప్రయాణం చేస్తుందని మాజీ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పి.వి.రమేష్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్ర దేశ్‌ అభివృద్ధి అనే అంశంపై విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చా గోష్ఠికి ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించా రు. రమేష్‌ మాట్లాడుతూ యువతరం దేశ, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించాలని, తమ భవిష్యత్తుపై ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుత సాంకేతిక అభివృద్ధి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వేగంగా పరిగెడుతుంటే మన భారత సమాజం 19వ శతాబ్దంలో నాటి విషయాల దగ్గర ఆగిపోయామని, రాజకీ య, ఆర్థిక, సామాజిక, అసమానతలు మరింత పెరిగాయన్నారు. ప్రజా స్వామ్యానికి పాలకుల నియంతృత్వ పోకడలు నష్టం చేస్తున్నాయని అన్నారు.

అప్పులతో అభివృద్ధి సంక్షోభానికి దారితీస్తుంది

అప్పులతో అభివృద్ధి చేయటం సాధ్యం కాదని దాని ద్వారా తీవ్రమైన సంక్షో భాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో డైరెక్ట్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ లాంటి పథకాలు తీసుకువచ్చి ఆయా దేశాలు నష్టపో యాయని తెలిపారు. నేడు మన రాష్ట్రంలో కూడా బటన్‌ నొక్కి  ప్రజల అకౌం ట్లోకి డబ్బులు పంపటం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందని వివరించా రు. నియంతృత్వ విధానాలు అభివృద్ధి నిరోధకమని ప్రజల ఓట్ల ద్వారా పదవు లు పొందిన పాలకులు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని అన్నారు. విద్య, వైద్య ప్రమాణాలు పెంచాలని ఉత్పాదక శక్తులను ప్రోత్సహించడం, సంపదని సృష్టించడం ద్వారా అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని అన్నారు. మెజార్టీ ప్రజల చేతుల్లో ఉండాల్సిన సంపద కొద్ది శాతం మంది ప్రజల దగ్గరే పోగు బడిరదని తెలిపారు. తద్వారా దేశంలోనూ, రాష్ట్రంలోనూ అసమానతలు పెరిగాయని అన్నారు. అధికారాన్ని, పదవిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఆస్తు లైన నదులు, గనులు, ఇసుక, మట్టిని ఇష్టారాజ్యంగా  దోచుకోవటం బాధాక రమన్నారు. రాబోయే తరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించ డం, అందుకు తగిన ఆర్థిక పునాదిని వేసుకోవడం నేడు పాలకులు చేయాల్సిన పనిగా గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ రివర్స్‌ ఇంజిన్‌ బండి ద్వారా సమాజం వెనక్కి పోతుందన్నారు.

పదేళ్లలో అభివృద్ధి శూన్యం…పాలకుల వైఫల్యమే…

రాష్ట్ర విభజన అనంతరం ఈ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం ముఖ్యంగా పోలవరం పూర్తి చేసుకోలేకపోవడం, రాజధాని నిర్మాణం చేసుకో లేకపోవడం, పాలకుల వైఫల్యమేనని పేర్కొన్నారు. పట్టణీకరణ పెరుగుతున్న ప్పటికీ ప్రజల మౌలిక అవసరాలు ప్రభుత్వం చేయాల్సిన సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం చూస్తుంటే ప్రజల పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఏ మా త్రం ఉందో ప్రజలు గమనించాలని అన్నారు. ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండాలని, ప్రభుత్వ సొమ్ముతో తీసుకొచ్చిన పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం, ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్సైజ్‌ ఆదాయం 24 వేల కోట్లకు చేరిందని ఎడమ చేతితో ఇచ్చి కుడి చేత్తో తీసుకుంటున్న సామెతను గుర్తు చేశారు. రాబోయే కాలంలో వచ్చే ఆదాయాలను చూపించి అప్పులు చేయడం. వివిధ రకాల ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టటం ఇవన్నీ చూస్తుం టే రాష్ట్ర అప్పు మన రాష్ట్ర జీడీపీతో సమానంగా ఉందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి గురించిన చర్చ జరగడం సిటిజెన్స్‌ ఫర్‌ డెమోక్రసీ  యువతరాన్ని భాగస్వామ్యం చేయటం అభినందనీయమని అన్నారు. యువత రం దేశాభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యమించాలని కోరారు. సోషల్‌ మీడియా పరిధిలోనే కాకుండా ప్రత్యక్షంగా ప్రజల మధ్య చర్చ జరగా లని కోరారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకురావాలని కోరారు.

పౌరులను లబ్ధిదారులుగా మార్చుకోవటం సరికాదు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి ప్రసంగిస్తూ పౌరులను లబ్ధిదారులుగా మార్చి ఓట ర్లుగా ఉపయోగించుకోవటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సమాజ ప్రజా సమష్టి ప్రయోజనాలకు తిలోదకాలిచ్చి మౌలిక అవస్థాపన సౌకర్యాల పైన రవాణా, విద్య, వైద్యం వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం వైదొలగడం సముచితం కాదన్నారు. ప్రభుత్వంలో వ్యక్తి నియంతృత్వం, కుటుంబ రాజకీ యాలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం

సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నేటి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 2.5 శాతం మాత్రమే గత ఐదేళ్లుగా నీటిపారుదల  ప్రాజె క్టులపై వ్యయం చేశారన్నారు. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ 30వ స్థానంలో ఉందన్నారు. 12 లక్షలకు పైగా రుణాలు చేసిన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్ర మాలను నిర్లక్ష్యం చేసిందన్నారు.

కులప్రాతిపదిక అమరావతి విధ్వంసం

ప్రముఖ హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ ప్రసంగిస్తూ నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారంగా 2017లో లక్షా 48 వేల నేరాలు నమోదైతే 2022లో దాదాపు రెండు లక్షల నేరాలు నమోదయ్యాయన్నారు. కుల ప్రాతి పదికగా ప్రజలను చీల్చాలని ప్రయత్నంలో భాగంగా రాజధాని  అమరావతిని విధ్వంసం చేశారన్నారు. హైకోర్టుకు కనీసమైన సదుపాయాలు కూడా ఇప్పటి వరకు కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, అఖిలభారత పంచాయతీ పరిషత్‌ (ఢల్లీి) జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు, మానవతా సంస్థ చైర్మన్‌ పావు లూరి రమేష్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో రంగం ప్రజా సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ ఆర్‌.రాజేష్‌ బృందం చైతన్య గీతాలు ఆలపించారు.