తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
హైదరాబాద్, మహానాడు : దివ్యాంగుల సంక్షేమంపై మోదీ బీజేపీ మేనిఫెస్టో భస్మాసుర హస్తం మోపిం దని, దానిని దేశంలోని దివ్యాంగులు తీవ్రంగా వ్యతిరేకించి కాల్చి బూడిద చేయాలని తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి నాయకులు ముత్తినేని వీరయ్య పిలుపు నిచ్చారు. సోమవారం హైదరాబాద్ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దివ్యాంగుల సంక్షేమానికి, రాజకీయ ఎదుగుదలకు, హక్కుల సంరక్షణకు పెద్దపీట వేసిం దని అన్నారు. త్వరలో చేపట్టనున్న రెండవ విజయ సంకల్ప యాత్రలో కాం గ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం, పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తుందని అన్నారు. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన పెరిక కులానికి కార్పొ రేషన్ ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమన్నారు.
దివ్యాంగులను బీజేపీ బిచ్చగాళ్ల లెక్క చూడటం హేయమైన చర్య అని, గృహాల కేటాయింపులో ఐదు శాతం అవకాశమిస్తూ గతంలో కాంగ్రెస్ ఇచ్చిన జీవోలను రద్దు చేసిన చరిత్ర ఆ పార్టీదని, పరికరాల ఉత్పత్తి కోసం శిక్షణ, ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే వాటిని ఎత్తేసిందన్నారు. ఇలా అన్ని రకాలుగా మోసగించిందన్నారు. ఈ సమావేశం లో పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోషియేట్ అధ్యక్షుడు కోట మల్లికా ర్జున్రావు, గ్రేటర్ హైద్రాబాద్ వికలాంగుల విభాగం అద్యక్షులు సతీష్ గౌడ్, చైతన్య రాజు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు సురేష్, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం అధ్యక్షురాలు సిరిగిరి రజనీ, బాల్దూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.