హైదరాబాద్, మహానాడు : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వారికి రేవంత్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.