శక్తి హ్యాండ్లూమ్‌ షాప్‌ ప్రారంభం

సికింద్రాబాద్‌, మహానాడు: సీతాఫల్‌ మండి డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు చేసిన శక్తి హ్యాండ్లూమ్‌ నూతన షాపును సోమవారం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ సామల హేమ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు రామేశ్వర్‌ గౌడ్‌, స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.