వాల్మీకి బోయలకు అండగా ఉంటా..ఆశీర్వదించండి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గ వాల్మీకి బోయల ఆత్మీయ సమావేశం మంగళవారం సత్తెనపల్లిలో జరిగింది. ముఖ్యఅతిథిగా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ ప్రభుత్వంలో వాల్మీకి బోయలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. మీకు చెందాల్సిన కార్పొరేషన్‌ నిధులను జగన్‌ తన ఖాతాల్లోకి మళ్ళించుకున్నాడని తెలిపారు.

వెనుకబడిన కులాల వారికి అండగా ఉండేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. మీ సమస్యలను కూటమి ప్రభుత్వం రాగానే త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బోయ, వాల్మీకి కార్పొరేషన్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.