వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
వినుకొండ, మహానాడు : అధికారంలోకి వచ్చింది మొదలు ఐదేళ్లుగా రాష్ట్రప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అడ్డదారు ల్లో నియమించిన అధికారులను తొలగించాల్సిందేనని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనే యులు డిమాండ్ చేశారు. వినుకొండ 19వ వార్డులో మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయా లన్న ఈసీ ఆదేశాలతో మద్యం ప్రవాహం, అక్రమాలకు కొంత అడ్డుకట్ట పడినట్లయింద న్నారు. ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జగన్ భక్తులను సాగనంపాలన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని, గతంలోనే తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా వివరాలు విడుదల చేశామన్నారు. కేంద్రంలోని వివిధ సర్వీసుల నుంచి 16 మందిని డిప్యూటేషన్‌పై తీసుకు రాగా వారిలో 10 మంది జగన్ సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. అలా కీలక శాఖలలో సొంత సామాజికవర్గ అధికారులను నియమించి జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని, ఎన్నికల సమయంలో అయినా వారందరికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. సమర్థు లైన అధికారులకు బాధ్యతలు ఇస్తేనే ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగు తాయని అన్నారు. ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.