శిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థికి జైలుశిక్ష

28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు సంచలన తీర్పు
ఆయనతో సహా ఆరుగురికి శిక్ష ఖరారు

విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలుశిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడిరచారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడిరది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులు గా తేల్చిన కోర్టు.. వారికి జైలుశిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘా లు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.