కూటమి అభ్యర్థులను గెలిపించండి

-టీడీపీ యువనాయకుడు కన్నా ఫణీంద్ర
-సత్తెనపల్లి రూరల్‌ మండలంలో ప్రచారం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్‌ మండలం కోమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, రైతన్నలకు అండగా ఏడాదికి రూ.20 వేలు సాయం, 20 లక్షల ఉద్యోగాలు, ఇంటింటికీ ఉచితంగా రక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. సత్తెనపల్లి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.