రేవంత్‌ నిర్లక్ష్యంతోనే గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు

బీఆర్‌ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్‌, మహానాడు: రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని, దాని కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా శాఖపై సమీక్షలు చేయడం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే విద్యార్థుల బలిదానాలు జరిగాయన్నారు. సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా గురుకుల పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఫీజులు భారీగా పెంచినా ఎటువంటి సమీక్షలు లేవన్నారు.

కోమటిరెడ్డి మంత్రి పదవి పోవటం ఖాయం
కేసీఆర్‌ గురించి మాట్లాడిన వాళ్లంతా కనుమరుగు అయ్యారు. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం వెంకట్‌రెడ్డి తాపత్రయపడుతున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ప్రాపకం కోసం కోమట ిరెడ్డి బ్రదర్స్‌ వ్యవహరిస్తున్నారని, ఆయనకు క్రెడిబిలిటీ లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.