మైనార్టీలను మోసగించిన జగన్‌ను సాగనంపాలి
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
మంగళగిరి, మహానాడు: నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తేస్తారనే ఫేక్ ప్రచారాన్ని ముస్లిం సోదరులు నమ్మొద్దని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ సూచించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవా రం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి తప్పదని గ్రహించిన జగన్ రకరకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపి ముస్లిం ఓటర్లను భయపెడుతున్నారని తెలిపారు. బీజేపీతో గతంలో టీడీపీ అనేకసార్లు పొత్తులో ఉన్నా ముస్లింలకు ఎలాంటి నష్టం జరగలేదని గుర్తుచేశారు. ముస్లింలపై అరాచకాలకు పాల్పడిన ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యే, సీఐ, హెడ్ కానిస్టేబు ల్ వేధింపులు తాళలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కేంద్రంలో ఎన్డీఏ తెచ్చిన 18 బిల్లులకు జగన్ చర్చ లేకుండా ఆమోదం తెలిపిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో దుకాన్ మకాన్ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా సాయం చేసిన దాఖలాలు లేవని, విదేశీ విద్య పథకం ద్వారా వచ్చే డబ్బులను కూడా ఆపేసి వారిని నానా అగచాట్లకు గురిచేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఇమాం, మౌజన్‌లకు ప్రవేశపెట్టిన రూ.10 వేలు, రూ.5 వేలు ఇవ్వకపోగా మొన్న రంజాన్ పండగకు కూడా జీతాలకు నామం పెట్టారని విమర్శించారు. ముస్లింలు డిపాజిట్ కట్టి టిడ్కో ఇళ్లు తీసుకుందామనుకుం టే వారిని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో మిస్బా ఆత్మహత్య చేసుకోవడాని కి వైసీపీ ప్రభుత్వమే కారణమని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగడాలతో పల్నాడు నుంచి బయటికి వచ్చి నివసిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నరసరావుపేటలో కత్తిపోట్లకు గురైన ఇబ్రహీం కుటుంబానికి ఆర్థిక సాయం చేయలేదని, జగన్ పాలనలో ఇలాంటి సంఘటనలు కో కొల్లలు ఉన్నాయన్నారు. ముస్లిం లు బాగుపడాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.