జీవీ తనయుడు హరీష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వినుకొండ అభివృద్ధి కోసం…ఒక్క అడుగుకు స్పందన
వినుకొండ, మహానాడు : వినుకొండ రేపటి భవిష్యత్తు… ఈ రోజు మనచేతుల్లోనే అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఇచ్చిన పిలుపు ఒక ప్రభంజనమైంది. ఉప్పొంగిన అభిమానంతో తరలి వచ్చిన యువదళంతో పట్టణ వీధులు పసుపుమయ్యాయి. అభివృద్ధికి ఓటేద్దాం.. అంజన్నను గెలిపించు కుందామంటూ వినుకొండ అభివృద్ధి కోసం ఒక్క అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన తనయుడు హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి వచ్చిన అపూర్వ స్పందన ఇది. బుధవారం సాయంత్రం వినుకొండ విష్ణుకుండి నగర్ కాల్వ కట్ట నుంచి శివయ్య స్తూపం సెంటర్ మీదుగా చెక్‌పోస్టు వరకు ర్యాలీ కొనసాగింది.
తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ, తెలుగు మహిళలు, వీర మహిళలు, బీజేపీ యువ మోర్చా కార్యకర్త లు పెద్దఎత్తున తరలివచ్చారు. హరీష్, సత్యకృష్ణ దంపతులు ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. అవినీతి, అహంకార పాలనకు స్వస్తి పలుకుతూ అభివృద్ధి, సేవ, ఆప్యాయతలను కలిగిన అంజన్న నాయకత్వాన్ని బలపరచాలన్న నినా దాలతో ఒక్కటిగా ముందుకు కదిలారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, గూడు లేని పేదలకు గృహాలు, విద్య, వైద్య సదుపాయాలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రంలోనే వినుకొం డను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్న జి.వి.ఆంజనేయులును అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకుడు నిశ్చంకర శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు లగడపాటి శ్రీనివాసరావు, వాసిరెడ్డి లింగమూర్తి, సాహెబ్, నలబోలు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.