-ఏపీకి 5.5 టీఎంసీలు
-మిగిలిన నీరు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగు నీటి అవసరాల కోసం
-సాగర్లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత
హైదరాబాద్: ఎండా కాలంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.నాగార్జున సాగర్లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. 500 అడుగుల వరకు సాగర్లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉందని తెలిపింది. అందులో ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన నీరు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగు నీటి అవసరాల కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతిచ్చారు.