విమాన టిక్కెట్లపై 19 శాతం రాయితీ
ఓటు హక్కు వినియోగానికి యువతకు ప్రత్యేకం
ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమం
న్యూఢల్లీి: దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో వారికి విమాన టిక్కెట్లలో ప్రత్యేక రాయితీ కల్పించేలా నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాల కు వెళ్లేందుకు విమాన టిక్కెట్లపై 19 శాతం రాయితీ ప్రకటించింది. ఈ టిక్కెట్లతో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.