-మద్యం మాఫియాలోనూ ఆయన ఘనుడు
-సీబీఐ 420 కేసు కూడా పెట్టింది
-17 కేసులున్న దుర్మార్గుడు విజయానందరెడ్డి
-ఇటువంటి నీచుడిని తరిమికొట్టాలి
-టీడీపీ నేత వరుణ్ ఫైర్
తిరుమల, మహానాడు: తిరుమల వన సంపదను కొల్లగొట్టిన ఎర్రచందనం స్మగ్లర్‌కు వైసీపీ టికెట్టా? అని టీడీపీ నేత వరుణ్ మండిపడ్డారు. చిత్తూరులో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తరపున చిత్తూరు అభ్యర్థి గా రెడ్ శాండిల్ స్మగ్లర్ విజయానందరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈయనపై దాదాపు 17 కేసులున్నాయని, వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సంపాదించిన డబ్బుతో రాజకీయ నాయకుడి ముసుగు వేసుకున్నాడు.. ఇప్పుడు ప్రజాప్రతినిధి అవతారమెత్తాడని వ్యాఖ్యానించారు. ఇతని గత చరిత్ర పరిశీలిస్తే..పీలేరులో 379, 353 ఐపీసీ సెక్షన్ల కింద అక్రమంగా ఎర్రచందనం తరలించడంపై కేసు నమోదైందని, ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు 15 ఉండగా, అక్రమ మద్యం సరఫరా కేసులు రెండు ఉన్నాయని వివరించారు. ఎన్నికలప్పుడు అక్రమ మద్యం రవాణా చేసిన కేసు బలంగా ఉంది.
విజయానందరెడ్డికి ఎల్‌ఎల్‌బీ అని కూడా పిలుస్తారని తెలిపారు. ఎల్ అంటే లిక్కర్, ఎల్ అంటే లాటరీ, బీ అంటే బెట్టింగ్ అన్నారు. ఈ మూడు వ్యవహారాల్లో ఈయన దిట్ట అన్నారు. నీచ చరిత్ర ఉన్న ఇటువంటి వ్యక్తికి జగన్ ఎలా టికెట్ ఇచ్చాడో? అని చిత్తూరు ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. కొన్నేళ్ల క్రితం అరెస్టు చేసి కొద్ది రోజులు పీలేరు జైలు, మరొకొన్ని రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. జైలు అధికారులను ప్రలోభపెట్టేవాడని, వీఐపీలకు అందించే వైద్యం ఇతనికి ఇచ్చేలా చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. చిత్తూరు ప్రజలు ఇటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపరని చిత్తుచిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. గంగాధర నెల్లూరులోని గ్రానైట్ క్వారీల ఓనర్లను కొట్టి బెదిరించి బినామీలకు కట్టబెట్టిన ఘటన ఉందన్నారు. సీఐడీనే ఇతనిపై 420 కేసు నమోదు చేసింది. ఇన్ని దారుణాలు చేసి సిగ్గులేకుండా ఓట్లడుగుతున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం రవాణా చేసే వ్యక్తి మనకు కావాలా? ఈయన పేరు చెబితే చిత్తూరుకు రావాల్సినవి కూడా రావు. ఒక్క కంపెనీ తెచ్చే ధైర్యం ఇతనికి లేదు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన వారు చిత్తూరుకు ఏం తెస్తారు, ఏం సాధిస్తారు? చిత్తూరు ప్రజలు ఏకమై విజ్ఞతతో కూటమి వ్యక్తి గురజాల జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.