ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీ కప్పులపై బొమ్మలు

-అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ నిర్వాకం
-ఆ కప్పులు మాకొద్దంటున్న యజమానులపై పోలీసుల బెదిరింపులు
-గులకరాయి కేసులో బోండా ఉమాను ఇరికించేందుకు కుట్ర
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
-చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు

మంగళగిరి, మహానాడు: ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం ఫిర్యాదు చేశారు. గులకరాయి దాడిలో హత్యాయత్నం కేసు పెట్టి అందులో తెదెపా నేత బోండా ఉమాను ఇరికేందుకు వైసీపీ నాయకులతో కలిసి విజయవాడ పోలీసు కమిషనర్‌ కుట్ర పన్నారని తెలిపారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న 74 మంది అధికారులకు ప్రభుత్వం క్లీన్‌ చీట్‌ ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు టీ కప్పులపై అతని బొమ్మ, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బొమ్మను ముద్రించి ప్రతి టీ స్టాల్‌కు పంపిణీ చేశారు. ఆ కప్పుల్లోనే టీ తాగాలంటూ ఓ పోలీసు అధికారి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. లంచాలు తిని బొజ్జలు పెంచిన 74 మంది అధికారులకు జగన్‌ రెడ్డి క్లీన్‌ చీట్‌ ఇచ్చాడు. దేశ చరిత్రలో ఇంతమందికి క్షమాభిక్షలు పెట్టిన దాఖలాలు లవని, దీనిపై ఖచ్చితంగా వీటిపై విచారణ జరగాలని కోరారు.

గులకరాయి దాడిలో బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ జగన్‌ రెడ్డిపై స్వామి భక్తి చూపుతున్నాడని, అసలు హత్యాయత్నమే జరుగలేదు…ఇప్పుడ సతీష్‌ అనే ఒక అమాయకుడిని తీసుకొచ్చి వీడే హత్యాయత్నం చేయబోయిన హంతకుడు అని చూపిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వర్ల హెచ్చరించారు. ఈసీని కలిసిన వారి మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.