అమరావతి: ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. పొత్తులలో భాగంగా టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు స్వయంగా బీ ఫారాలు అందజేయనున్నారు. ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకటి రెండురోజుల్లోనే తేల్చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్రంలో ఉన్న టీడీపీ జోనల్ ఇన్‌చార్జ్‌లతో సమావే శమయ్యారు. టీడీపీ సూచించిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.