అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి…
అవినీతి అంటని నాయకుడు కిషన్‌రెడ్డి
మతం, కులం తెలియని వ్యక్తి
సికింద్రాబాద్ అభివృద్ధే అందుకు నిదర్శనం
మరోసారి ఎంపీగా గెలిపించాలి
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
సికింద్రాబాద్, మహానాడు : సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని తెలిపారు. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో చూస్తున్నామని, ఆయన అవినీతి అంటని నాయకుడని కితాబిచ్చారు. అనేకమంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదు..ఆయన నాతో పాటు కూడా పని చేశారని, పార్లమెంటులో మీ గళం వినిపిస్తారని తెలిపారు. కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెలను గెలిపించాలని కోరారుఉ. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటెల బీఆర్ఎస్ అవినీతిని చూసి బయటకు వచ్చేశాడని తెలిపారు.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అత్యంత వేగంగా ఎదుగుతున్నామని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. 2047 లోపు దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అయోధ్య రామమందిరం కట్టామని…రామరాజ్యం వచ్చిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశాం.. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు స్వేచ్ఛగా భారత ప్రభుత్వంలో ఉంది. ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం.. సీఏఏను తీసుకువచ్చాం. బీజేపీ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అని వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే.. అక్కడ మన విద్యార్థులు ఉన్నారని రెండు దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకొచ్చిన ఘనత మోదీదని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా దేశంలో డిజిటల్ చెల్లింపులు తీసుకువచ్చామని క్లారిటీ ఇచ్చారు. గతంలో 33 శాతం కాంగ్రెస్ రిజ్వరేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మోదీ చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశం ఇప్పుడు అత్యంత శక్తివంతమైనదిగా అవతరించిందని, రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తివంతంగా తయారు చేశామని వివరించారు.