కాషాయ రంగులోకి డీడీ న్యూస్‌ లోగో

బీజేపీపై విపక్షాల విమర్శల వెల్లువ
ఎన్నికల వేళ స్వామి భక్తి అంటూ మండిపాటు

న్యూఢల్లీి: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్‌ చానల్‌ దూరదర్శన్‌ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగిన డీడీ న్యూస్‌ చానల్‌ లోగో రంగు ను మార్చారు. అది కూడా కాషాయ రంగుకు మార్చటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోగోతో పాటు న్యూస్‌ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చారు. దీంతో పెద్దఎత్తున విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూరదర్శన్‌ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించిందని, అందుకే కాషాయ రంగులోకి మార్చేసి తన విధేయతను చాటుకుందని ఆరోపిస్తున్నా రు. ఈ మార్పుపై పూర్వ దూరదర్శన్‌ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్‌ స్పందిస్తూ ‘ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దూరదర్శన్‌ చర్య మత ఉద్రిక్తతలను పెంచుతుందని తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండిరచారు.