టీడీపీ అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యం

జగయ్యపేట కూటమి అభ్యర్థి శ్రీరాం తాతయ్య
వత్సవాయి మండల ప్రచారంలో బ్రహ్మరథం

జగ్గయ్యపేట, మహానాడు : గ్రామాలలో తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమని జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం తాళ్లూరు, మాచినేనిపాలెం, కాకరవాయి గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వ హించారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌(చిన్ని), ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామంలో సిమెంట్‌ రోడ్లు టీడీపీ ఆధ్వర్యంలోనే వేశారన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క సిమెంట్‌ రోడ్డు కూడా వేయలేదన్నారు.

మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిమెంట్‌ రోడ్లు, డ్రిరకింగ్‌ వాటర్‌, డ్రైనేజీ సిస్టం ఇలా ఎన్నో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్లు మొత్తం కూడా దారి మళ్లించి ఆ నిధులు కూడా స్వాహా చేశారన్నారు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పాలసీ ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఇసుక దోపిడీ చేస్తూన్నారన్నారు. ఈ నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీ చేస్తూ చివరికి పేదవారి రేషన్‌ బియ్యం కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ గంజా యి దొరికనా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మం డల టీడీపీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జొన్నలగడ్డ రాధాకృష్ణ మూర్తి, బీజేపీ నాయకులు అన్నెపాగా ప్రపుల్ల శ్రీకాంత్‌, జనసేన నాయకులు బాడిశ మురళీకృష్ణ, తాళ్లూరు, మాచినేనిపాలెం ఎంపీటీసీ బొల్లా వెంకటేశ్వరరావు, కాకరవాయి గ్రామ సర్పంచ్‌ గుర్రం రామారావు పాల్గొన్నారు.