-ఉద్యోగులపై తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం
-ఆ రెండు పత్రికలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం
-కరోనా, హెచ్ఐవీ కంటే ప్రమాదకరం
-ప్రభుత్వంపై దుష్ప్రచారం కోడ్ ఉల్లంఘన కాదా?
-ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్
అమరావతి, మహానాడు: తమపై ఈనాడు దినపత్రిక ప్రచురించిన తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెం ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భం లో రెండు దినపత్రికల కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరినట్లు వివరించారు. మార్చి 31న తాను కడప జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించాం. అయితే అదేరోజు ఈనాడు దినపత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం వల్ల ఉద్యోగులు మునిగిపో యారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించింది. దానిని ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలు జరిగిందని, తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేసినట్లు చెప్పారు.
దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు పత్రిక ఏప్రిల్ 2న ఎలాంటి ఆధారాలు లేకుండా నేను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఒక ఫొటో పట్టుకుని ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నా నంటూ తప్పుడు కథనం ప్రచురించిందని, దాని కథనం ఆధారంగా మా మీద నాలుగు కేసులు పెట్టి 11 మందిని సస్పెండ్ చేసినట్లు వివరించారు. మాపై చర్యలు తీసుకునే దాకా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వరుస కథనాలు రాస్తూనే వచ్చాయి. ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నా రు. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు, ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? ఇదేనా నిష్పక్ష పాతం గా వార్తలు రాసే విధానం. ఈ పత్రికలు విషపురుగులతో సమానం. కరోనా కంటే భయంకరమైన వైరస్లు. ‘‘హెచ్ఐవీకి మందు లేదు – నివారణ ఒక్కటే మార్గం’’ అని ప్రకటనల ద్వారా 20 సంవత్స రాల కిందట ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. హెచ్ఐవీ లాగే ఈనాడు వైరస్ కూడా మందు లేదు. దానికి దూరంగా ఉండటమే ఉత్తమం.
అందుకే మా సంఘం తరపున ఈనాడును బహిష్కరిస్తున్నాం… ఉచితంగా ఇచ్చినా ముట్టుకోవద్దని సూచించారు. ఆ రెండు పత్రికలు మమ్మల్ని వెంటాడి వేధిం చాయి. మేము అదే స్థాయిలో స్పందిస్తాం. ఎన్నికల కోడ్ అతిక్రమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రెండు పత్రికలలో ఎవరు మాట్లాడినా, అలాంటి సమా వేశాల గురించి వార్తలు రాసినా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాము. ఇటీవల ఆ పత్రికలలో వార్తలు వచ్చాయి. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరాం. ఎన్నికల కోడ్ అతిక్ర మించి సమావేశాలు నిర్వహించి మీడియాతో మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయనగరం, గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్టణం, తిరుపతి అనంతపురం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలి చ్చారు. ఏ రోజు పత్రికలలో వచ్చిన వార్తలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.