టీడీపీలోకి రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు

చంద్రబాబు సమక్షంలో చేరిక

రాయదుర్గం, మహానాడు: రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు టీడీపీలో చేరారు. శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్‌ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాయదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన చేరారు. ఈ సందర్భంగా బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు.