పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు శనివారం సత్తెనపల్లి రూరల్ మండలం రెంట పాళ్ళ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి కోలాట ప్రదర్శన, బాణసంచా, తప్పెట్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. వైసీపీ విధ్వంస పాలన పోయి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.