గుంటూరు, మహానాడు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో చేరారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు అభ్యర్థి నసీర్ అహ్మద్ సమక్షంలో వారు కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నంబూరు సుభాని, గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.