-టీడీపీ అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు
-ఉండవల్లి నివాసంలో బీ ఫారాలు అందజేత
అమరావతి, మహానాడు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందజేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులతో మొదలుపెట్టి ఒక్కో జిల్లా పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో ప్రమాణం చేయించారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నేను…
‘‘తెలుగుదేశం పార్టీ శాసనసభ/పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికైన నేను పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు, నిర్ణయాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, పార్టీకి విధేయతతో ప్రజా సంక్షే మం కోసం నిరంతరం కృషిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదిం చిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా నీతి, నిజాయితీతో నిరాడంబరంగా ప్రజా సేవకు అంకితమ వుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కుల, మత, వర్ణాలకు అతీతంగా సర్వ వర్గ సంక్షేమానికి, ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేస్తాను. ప్రజా తీర్పు ద్వారా నాకు సంక్రమించే పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించి దేశ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయసాధనకు పాటుపడుతూ తెలుగు వారి
ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తాను. నేడు విధ్వంసమైన మన రాష్ట్రాన్ని పునర్నిర్మిం చుకోవడంలో భాగస్వామిని అవుతాను. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల ప్రాణాలకు రక్షణ గా నిలుస్తాను. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం అవిశ్రాంతంగా మనసా, వాచా, కర్మేణా కృషిచేస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు.