గంగాధరశాస్త్రిని కలిసిన రామినేని, పాతూరి

హైదరాబాద్‌: ప్రసిద్ధ ధార్మిక, సామాజిక సేవా సంస్థ ‘రామినేని ఫౌండేషన్‌’ చైర్మన్‌ రామినేని ఆదివారం ధర్మ ప్రచారక్‌, ఆ సంస్థ కన్వీనర్‌, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణంతో కలిసి హైదరాబాద్‌లోని ‘భగవద్గీత ఫౌండేషన్‌’ను సందర్శించారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్‌.వి.గంగాధరశాస్త్రిని శాలువాతో సత్కరించారు. అనం తరం బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలు కోసం బీజేపీ చేస్తున్న కృషిపై చర్చించారు.