అడ్డమైన ప్రకటనలు చేసి మోసగించారు…

నీతి, జాతి లేని పార్టీలను నమ్మొద్దు
మల్కాజ్‌గిరి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏం చేస్తారో అడగండి..
రాజకీయాలు ఎందుకని నిలదీయండి
ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌, మహానాడు : అడ్డమైన ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌ను నమ్మొద్దని  మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ కోరారు. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజక వర్గంలోని అస్మద్‌ పేటలో పప్పుపటేల్‌ నివాసంలో ఆదివారం స్థానికులు ఏర్పాటు చేసిన బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఇంకా కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్‌, బీజేపీ నాయకులు కాంతారావు, ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌, స్థానిక బీజేపీ నేతలు, అపార్ట్‌మెం ట్‌ వాసులు, మార్వాడీ, వైశ్య సంఘాల ప్రతినిధులు, బోయినపల్లి నగరశాఖ సభ్యులు పాల్గొ న్నారు.

ఈ సమావేశంలో ఈటెల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓటు వేయడానికి ఇష్టపడని వారు కూడా మోదీ పదేళ్ల పాలన చూసి ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు..66 హామీలు ఇచ్చారు. ఎవడు ఎటుపోతే నాకేంటి..నేను సీఎం అయితే చాలు అని అడ్డమైన ప్రకటనలు చేసి మోసగించారు…వారికి నీతి, జాతి లేదని మండిపడ్డారు. నేను 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడా… పేరు కేసీఆర్‌కు రావొచ్చు కానీ, కష్టపడిరది మేము. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రాణాలు పణంగా పెట్టి రోగుల మధ్య తిరిగిన బిడ్డను నేను. ఎవరికీ తలవంచకుండా ప్రజల బాగే అజెండాగా బతుకుతున్నాం. రాజకీయాలను స్వలాభం కోసం కాకుండా.. ప్రజల కోసం అనే భావన ఉన్న వాళ్లం.

మల్కాజిగిరి సంపూర్ణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యం. సంపూర్ణంగా ఆశీర్వదించాలని కోరారు. 38 లక్షల ఓటర్ల ను నేను నేరుగా కలిసే అవకాశం లేదు.. మీరే కథానాయకులై గెలిపించాలని కోరారు. కంటో న్మెంట్‌ అభ్యర్థి వంశ తిలక్‌ గొప్ప చదువులు చదువుకున్నారు. డాబు దర్పం లేకపోవచ్చు కానీ, సంస్కారవంతుడు. ఆయనను కూడా ఆశీర్వ దించమని కోరుతున్నాను. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మల్కాజ్‌గిరికి ఏం చేస్తారో అడగండి.. రియల్‌ ఎస్టేట్‌ చేస్తే చేసుకోమనండి…ఈ రాజకీయాలు ఎందుకని అడగాలని కోరారు.