పేదరికం లేని సమాజమే కూటమి లక్ష్యం

-ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తాం
-వైసీపీని ఇంటికి పంపేందుకు ఏకం కావాలి
-కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో రాణించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని సమాజం గా నిర్మించడమే కూటమి యొక్క లక్ష్యమని సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరా వుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో సూపర్‌ 6 పథకాలను వివరించారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మళ్లీ పరుగులు పెట్టించడానికి రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రాబోతుంద న్నారు. దళిత మైనారిటీ వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, గ్రామాల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.