నందిగామ సమస్యలు పరిష్కరిస్తా

-సూపర్‌ 6 పథకాలతో అభివృద్ధి
-ఎన్నికల ప్రచారంలో కన్నా ఫణీంద్ర

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్‌ మండలం నందిగామలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు మద్దతుగా కన్నా ఫణీంద్ర సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలకు అవసరమైన షాదీఖానా నిర్మాణం, సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైనేజీ, హఫీ సాబ్‌ రూము నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.